![]() |
![]() |

జెనీలియా దేశ్‌ముఖ్ చెప్పిన మాటలు ఇప్పుడు నార్త్ లో గట్టిగా వైరల్ అవుతున్నాయి. యాక్టింగ్‌కి కొన్నేళ్లుగా దూరంగా ఉన్న జెనీలియా గతేడాది మళ్లీ స్క్రీన్ మీదకు వచ్చారు. తన భర్త డైరక్షన్‌లో వేద్ సినిమాలో నటించారు. సమంత నటించిన మజిలీ సినిమాకు రీమేక్ ఇది. సినిమాలకు దూరంగా, కుటుంబానికి దగ్గరగా ఉన్నప్పటికీ, తనకు నటనంటే చాలా ఇష్టమని చెబుతున్నారు జెనీలియా. ఇటీవల నార్త్ మీడియాతో మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను రివీల్ చేశారు. శివాజీ చిత్రాన్ని ఎప్పుడు ఫ్లోర్స్ కి తీసుకెళ్తారు? అనే ప్రశ్న ఎదురైంది జెనీలియాకు. దీనికి ఆమె కాన్ఫిడెంట్‌గా సమాధానం చెప్పారు. ``అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తామని మాత్రం చెప్పలేను. కానీ తప్పకుండా సినిమా చేస్తాం. మూడు భాగాలుగా తెరకెక్కిస్తాం. ఈ సినిమా రితీష్‌కి చాలా చాలా ఇష్టం. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. తప్పకుండా చాలా పెద్ద సినిమాగా చేస్తారు. భారతదేశం మొత్తం తిరిగి చూసేలా ఉంటుంది ఈ మూవీ`` అని అన్నారు. శివాజీ 390వ జయంతి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు రితీష్ దేశ్‌ముఖ్. ముంబై ఫిల్మ్ కంపెనీ ప్రొడక్షన్‌లో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. నాగరాజ్ మంజులే ఈ సినిమాకు డైరక్ట్ చేస్తారు. జై శివ్‌రాజ్ అంటూ ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో అనౌన్స్ చేశారు రితీష్.
జానే తు.. యా జానేనా సినిమా విడుదలై 15 ఏళ్లయినందుకు ఆనందంగా ఉందని చెప్పారు జెనీలియా. ఆ సినిమా తర్వాత తనను అందరూ అదితి అని పిలిచిన క్షణాలను మర్చిపోలేనని చెప్పారు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే చేయాలని ఉందని అన్నారు.
![]() |
![]() |